అతివేగపు కారు ఢీకొని బైక్ రైడర్ మృతి
29-11-2026 | 07:51pm
జనగామ, నవంబర్ 29 (విజయక్రాంతి): కిలాషాపూర్(Kilashapur) నుండి రఘునాథపల్లి(Raghunathapalli) వైపు బైక్ పై వెళ్తున్న వనపర్తి గ్రామానికి(Vanaparthi village) చెందిన శాగ యాదగిరి (40)ను, ఎదురుగా అతివేగంగా వచ్చిన ఎర్టిగా కారు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలై యాదగిరి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడిపిన వ్యక్తి నర్సాపూర్ గ్రామానికి చెందిన పల్లె నరేష్. ఎస్సై భరత్ కేసు నమోదు(Case registration) చేసి దర్యాప్తు చేస్తున్నారు.