అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం

17-11-2026 | 05:14pm

ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్లు, మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి(MLA Rajesh Reddy) అన్నారు. మంగళవారం ఓ ప్రైవేట్ గార్డెన్స్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పేదల సంక్షేమం, అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునీంద్ర, కమిషనర్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్ బాదం రమేష్, వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు