కన్నారెడ్డి గ్రామంలో దోమల మందు పిచికారి
నాగిరెడ్డిపేట్, నవంబర్ 17 (విజయక్రాంతి): మండలంలోని కన్నారెడ్డి గ్రామం(Kanna Reddy village)లో దోమల మందు పిచికారి చేసినట్లు గ్రామ సర్పంచ్ సాయిలు తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్యమే తన దేహంగా భావిస్తూ, గ్రామంలో ప్రజలు జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు దోమల మందు పిచికారి చేసినట్లు సర్పంచ్ సాయిలు తెలిపారు.
గ్రామంలోని మురికి కాలువల వెంబడి, వివిధ పరిసరాలలో దోమల మందు పిచికారి చేసినట్లు సర్పంచ్ సాయిలు తెలిపారు. దాంతో పాటు గ్రామంలోని ప్రజలందరూ తమ ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. గ్రామంలో ఈగలు దోమలు చేరకుండా తను అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని సర్పంచ్ సాయిలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయిలు, పంచాయతీ కార్యదర్శి రమేష్, జిపిఓ, ఏఎన్ఎం గ్రామస్తులు ఉన్నారు.