హైదరాబాదు రోడ్డు ప్రమాదంలో భూపాలపల్లి వాసి మృతి

15-11-2026 | 02:41pm

భూపాలపల్లి టౌన్, నవంబర్ 15 (విజయక్రాంతి): హైదరాబాదులోని పంజాగుట్ట ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం(Hyderabad Bus Accident)లో భూపాలపల్లికి చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎల్ బి నగర్ కు చెందిన కోండ్ర స్వామి భాగ్యలక్ష్మి దంపతులకు ఒక కూతురు, కుమారుడు ఉన్నాడు. స్వామి సింగరేణి కేటీకే ఓసీపీ 3 గనిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

స్వామి కుమారుడు ప్రశాంత్ (34) హైదరాబాదులోని అల్వాల్ లో 8 సంవత్సరాలుగా ఉంటూ బంజారాహిల్స్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్కూటీపై ఉద్యోగానికి వెళ్లి వస్తున్న సమయంలో సాయంత్రం 5 గంటలకు జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందాడు. దీపావళి పండుగకు కుటుంబంతో వచ్చి వెళ్లారు. ఇంతలోనే తమ కుమారుని మరణ వార్త విని తల్లిదండ్రులతో పాటు కాలనీవాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు