ఘనంగా ఎమ్మెల్యే గండ్ర జన్మదిన వేడుకలు

09-11-2026 | 05:14pm

గణపురం,నవంబర్ 09 (విజయక్రాంతి): భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(Bhupalpally MLA Gandra Satyanarayana Rao) జన్మదిన వేడుకలను సోమవారం గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపెళ్లి భాస్కర్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకున్నారు. ఎమ్మెల్యేకు నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు