వివాహ వేడుకల్లో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేం వెంగళరావు
15-11-2026 | 07:32pm
చేగుంట నవంబర్ 15: చేగుంట మార్కెట్ కమిటీ(Chegunta Market Committee) డైరెక్టర్ రమేష్ గుప్తా కుమార్తె వివాహ వేడుకలు నార్సింగిలో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకలకు చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేం వెంగళరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి సర్పంచ్ నర్సింహా, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.