క్యాన్సర్‌తో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం

15-11-2026 | 07:26pm

చేగుంట నవంబర్ 15, (విజయక్రాంతి): చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన ఎర్ర దుర్గయ్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న లీల గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్(Mohan Naik) ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలని అన్నారు. దుర్గయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ మోహన్ నాయక్‌ను గ్రామస్థులు అభినందించారు.

మరిన్ని వార్తలు