పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తిచేయాలి
డిఎస్పీ సూర్యనారాయణ
మహదేవ్పూర్, నవంబర్ 14, (విజయక్రాంతి): పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ(DSP Suryanarayana) అన్నారు. మంగళవారం మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులు, క్రైమ్ రికార్డులు, కేసు డైరీలు (సి డి ఫైల్స్), పెండింగ్ కేసుల వివరాలు మరియు ఇతర ముఖ్యమైన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. కేసు డైరీలు (సి డి ఫైల్స్), స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని నేరాల నియంత్రణకు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సైబర్ నేరాలు, గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలన్నారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని ఆదేశించారు. ఆయన వెంట మహదేవ్పూర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సాంబమూర్తి మరియు సిబ్బంది పాల్గొన్నారు.