పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి:
- పీఆర్టీయూ-ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గజగట్ల నాగరాజు
చేగుంట నవంబర్ 17,విజయక్రాంతి: ఉపాధ్యాయ, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(Contributory Pension Scheme) (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను వెంటనే అమలు చేయాలని పీఆర్టీయూ-ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గజగట్ల నాగరాజు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి,పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ సేవల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు న్యాయం చేయాలని గజగట్ల నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు.