నూతన భవన నిర్మాణానికి భూమిపూజ

09-11-2026 | 04:27pm

మహా ముత్తారం,(విజయక్రాంతి): మహా ముత్తారం మండలం(Mahamuttaram mandal)లోని కనుకునూరు గ్రామపంచాయతీలో విబిజి రామ్ జీ పథకం(VB-G RAM G Scheme) కింద రూ.10 లక్షల వ్యయంతో నూతన  (విలేజ్ ఆర్గనైజేషన్) భవన నిర్మాణానికి ఈరోజు భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పులిసె సుమలత రాజు పాల్గొని నూతన భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పులిసె సుమలత రాజు(Sarpanch Pulise Sumalatha Raju) మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి, మహిళా సంఘాల సభ్యులు తమ సమావేశాలు నిర్వహించుకోవడానికి, సంఘాల కార్యకలాపాలను సమర్థవంతంగా కొనసాగించడానికి మహిళా సంఘాలకు  భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మా వంతు సహాయ సహకారాలు మహిళా సంఘాలకు ఉంటాయని తెలిపారు. 

 ఈ కార్యక్రమంలో మహా ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాజయ్య, డి సి సి కార్యదర్శి, ఉపసర్పంచ్ చాట్ల అంజిబాబు, తొలం వెంకటేశ్వర్లు, వి ఓ అధ్యక్షురాలు మారబోయిన పుష్పలత, సమ్మక్క రేగా, వార్డు సభ్యులు పేరా అంజలి, పోడెం సరిత, గ్రామ కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్కూర్ పోచయ్య, బోడిగే రమేష్, పోడెం ప్రవీణ్, యనిక కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు