నిర్మల్ జిల్లాకు ఎక్సలెన్స్ అవార్డు

09-11-2026 | 05:51pm

నిర్మల్ నవంబర్ 9 ( విజయక్రాంతి) : అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana) (APY) అమలులో 2025–26 ఆర్థిక సంవత్సరానికి నిర్మల్ జిల్లా 95 శాతం నమోదు లక్ష్యాన్ని సాధించి ఎక్సలెన్స్ అవార్డును(Excellence Award) దక్కించుకుంది. జిల్లాలో మొత్తం 56,145 మంది ఈ పథకంలో చేరగా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్(Telangana Grameena Bank), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు విశేష కృషి చేశారు.

ఈ నెల 6న హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పీఎఫ్‌ఆర్‌డీఏ సీజీఎం ఆశుతోష్ కుమార్ చేతుల మీదుగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంగోపాల్ అవార్డును అందుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఈ అవార్డును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఎల్‌డీఎం రాంగోపాల్‌ను అభినందించారు. జిల్లాకు ఈ గుర్తింపు రావడానికి కృషి చేసిన బ్యాంకు అధికారులు, సిబ్బందిని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకట మాధవరావు, రాథోడ్ రమేష్, డి పి ఆర్ ఓ  విష్ణు  వర్ధన వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు