రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి, నవంబర్ 17 (విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదాలను(road accidents) నివారించి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma), ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(SP Sirisetti Sankeerth) ఆదేశించారు.
మంగళవారం ఐడీఓసీలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు, రోడ్ మార్కింగ్స్, లైటింగ్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.
ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందుతుందని, దీనిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని రాహుల్ శర్మ సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సంకీర్త్ ఆదేశించారు. సమావేశంలో ఆర్టీఓ శ్రీనివాస్, పీఆర్ ఈఈ విద్యాసాగర్, జాతీయ రహదారుల ఈఈ వెంకటరావు, డా. వెంకన్న, డా. రాజేష్, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.