ఇందిరమ్మ ఇండ్లల్లో దీపావళి పండుగ సంబరాలు
తాడ్వాయి,నవంబర్,09( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం ఎర్రపహాడు గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Houses) లబ్ధిదారులతో(Beneficiaries) కాంగ్రెస్ పార్టీ నాయకులు దీపావళి పండుగ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల ఇండ్లలోకి వెళ్లి కుటుంబ సభ్యులతో సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఎమ్మెల్యే మదన్ మోహన్ రావులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సొంటికే మల్లవ్వ బీరయ్య, ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని రాజలింగం,సొసైటీ డైరెక్టర్ మల్లేష్ రెడ్డి, నాయకులు మోహన్ రెడ్డి,జలంధర్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.