ప్రీ రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపికైన ఎస్.ఆర్.ఆర్. విద్యార్థిని అభిశ్రీ

09-11-2026 | 05:49pm

ముకరంపుర, నవంబర్ 9 (విజయ క్రాంతి): ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(S.R.R. Government Arts and Science College) (ఏ), కరీంనగర్‌కు చెందిన బి.ఎస్‌సి ద్వితీయ సంవత్సరం విద్యార్థిని మేఖల అభిశ్రీ(Mekhala Abhishri) ప్రీ రిపబ్లిక్ డే  పరేడ్‌కు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ విద్యార్థిని మేఖల అభిశ్రీని ప్రత్యేకంగా అభినందించి, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. సౌత్ వెస్ట్ జోన్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ ఈనెల10 నుండి 19  వరకు హైదరాబాద్‌లోని అనురాగ్ యూనివర్సిటీలో నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు