వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి

09-11-2026 | 05:47pm

తాడ్వాయి,నవంబర్,09( విజయక్రాంతి): రైతులు(Farmers) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ సంతాజి గారి సుధాకర్ రావు తెలిపారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం ఏండ్రియాల, కృష్ణాజివాడి గ్రామాల్లో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వరి ఏ గ్రేడ్ రకానికి ప్రభుత్వం మద్దతు ధర రూ.2461, బి గ్రేడ్ రకానికి రూ.2441 చెల్లిస్తుందని తెలిపారు.

ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్ కు మరో రూ. 500 బోనస్ గా అందిస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, దేవికలాన్ సింగిల్ విండో అధ్యక్షులు ఏనుగు వెంకట్ రెడ్డి, నాయకులు జక్కుల రాజిరెడ్డి, వెంకట్ రెడ్డి,శ్యామ్ రావు మేకల రాజు, నారాయణరెడ్డి వ్యవసాయ అధికారి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు