జిల్లా స్థాయి పోటీల పోస్టర్ ఆవిష్కరించిన బండి సంజయ్
ముకరంపుర, నవంబర్ 9(విజయక్రాంతి): వికసిత్ భారత్ యువ పార్లమెంట్(Viksit Bharat Youth Parliament) – 2027 జిల్లా స్థాయి పోటీలకు సంబంధించిన పోస్టర్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) ఆవిష్కరించారు.ఈ పోటీలు ఈనెల 10 న కరీంనగర్లోని ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(SRR Government Arts and Science College) (ఏ)లో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ తెలిపారు.
ఈ పోటీలకు “నషా ముక్త యువ – వికసిత్ భారత్” అనే అంశాన్ని ఎంపిక చేశారు. ఇందులో పాల్గొనే అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.ఆసక్తి గల విద్యార్థులు మై భారత్ పోర్టల్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
ఇచ్చిన అంశంపై ప్రతి అభ్యర్థి మూడు నిమిషాల పాటు ప్రసంగించాలి.
జిల్లా స్థాయిలో ఎంపికైన అభ్యర్థులు తదుపరి రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాల్సి ఉంటుంది. పార్లమెంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రసంగించిన ఎం. శ్రీనిత్య కు బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలియజేస్తూ సన్మానించారు.. ప్రసంగ ప్రతిభను, విషయ పరిజ్ఞానాన్ని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు రమణారెడ్డి, వెంకటేష్, ఎస్.ఆర్.ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ, టి జి సి జి టి ఏ రాష్ట్ర అధ్యక్షులు డా. కె. సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.