దుకాణాల ఏర్పాటుపై విచారణ జరపాలి

09-11-2026 | 05:33pm

నిర్మల్ నవంబర్ 9 ( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలోని ధర్మసాగర్ చెరువు సమీపంలో ఉన్న జాతీయ జెండా పార్కు వద్ద ఏర్పాటు చేసిన దుకాణాల అనుమతులపై విచారణ జరిపించాలని బీజేపీ కౌన్సిలర్లు జాదవ్ సూరజ్ నాయక్(BJP Councilor Jadhav Suraj Naik), అయిండ్ల విజయలక్ష్మి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు(District Collector Bhavesh Mishra) సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్కు స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ఎవరు అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు.

ఎలాంటి టెండర్ ప్రక్రియ నిర్వహించకుండా తమకు అనుకూలమైన వారికి దుకాణాలు కేటాయించడం సరికాదని ఆరోపించారు. పార్కు స్థలంలో వాణిజ్య కార్యకలాపాలకు ఎలా అనుమతులు ఇచ్చారో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించి, నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు