మల్లికార్జున స్వామి మండపానికి ఎమ్మెల్యే నిధులు మంజూరు
పనులను ప్రారంభించిన బిజెపి నాయకులు
కామారెడ్డి, నవంబర్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో మల్లికార్జున స్వామి కళ్యాణమండపం నిర్మాణం పనుల్లో భాగంగా ఆదివారం గ్రౌండ్ ఫ్లోర్ లో ఫ్లోరింగ్ పనులను గ్రామ అభివృద్ధి కమిటీ కార్యవర్గం, కౌన్సిలర్లు ప్రారంభించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి(MLA Katipally Venkata Ramana Reddy) తన సొంత నిధులతో ఈ పనులు చేపట్టినట్లు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గూడెల్లి గంగారం తెలిపారు. ఇదివరకే ఎమ్మెల్యే తన సొంత నిధులతో రెండు అంతస్తుల స్లాబ్ పనులు చేయించగా తాజాగా ఫ్లోరింగ్ పనులకు సహకారం అందించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
రానున్న రోజుల్లో మొదటి అంతస్తులో టైల్స్ సైతం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పనులను బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల శుభకార్యాల నిమిత్తం నిర్మిస్తున్న మల్లికార్జున స్వామి కళ్యాణ మండపం మరికొద్ది రోజుల్లో నిర్వహణలోకి రానుందని విడిసి కార్యవర్గం తెలిపింది.
ఈ కార్యక్రమంలో స్థానిక 10 వ వార్డు కౌన్సిలర్ కాసర్ల మాధవి, కౌన్సిలర్లు భాను ప్రకాష్, మధు, విడిసి ఉపాధ్యక్షులు నిట్టు లింగారావు, వంగ రాహుల్ కుమార్, ప్రధాన కార్యదర్శి ద్యావరి నవీన్ కుమార్, బీజేపీ నాయకులు కాసర్ల రవీందర్, చిన్నోళ్ళ రజనీకాంత్, రామకృష్ణా రావు, విపుల్ జైన్, భూమేష్ యాదవ్, రమణ, సందీప్, రాజగోపాల్, కాంగ్రెస్ నాయకులు ఊరుదొండ రవి, మర్కంటి స్వామి, విడిసి సభ్యులు నాగళ్ళ స్వామి, నీలం రాజలింగం, మోత్కురి నరేష్, దేవల రమేష్ తదితరులు పాల్గొన్నారు.