లబ్ధిదారులకు పింఛన్లు అందజేత...
17-11-2026 | 08:53pm
తాడ్వాయి,నవంబర్,17(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో(Nandiwada Village) మంగళవారం కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు స్థానిక సర్పంచ్ పోచయ్య పింఛన్లు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల కోసం నిరంతరంగా కష్టపడుతున్నారన్నారని తెలిపారు.
ఎంతో మంది పేదలు పింఛన్లు లేక చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ముఖ్యమంత్రి స్పందించి అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్లు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బాల సాయిలు,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.