ప్రజావాణి అర్జీల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
ముకరంపుర, నవంబర్ 9(విజయక్రాంతి): ప్రజల సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి, వాటికి సత్వర పరిష్కారం చూపడమే ప్రజావాణి ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా(District Collector Chitra Mishra) స్పష్టం చేశారు. ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష ప్రజావాణి కార్యక్రమ
అనంతరం పెండింగ్ దరఖాస్తులపై(Pending applications) జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అత్యధిక దరఖాస్తులు పెండింగ్లో ఉన్న జిల్లా పంచాయతీ, పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్, విద్యుత్ శాఖ ఆర్టీసీ ఇరిగేషన్ తదితర శాఖల అధికారులను దరఖాస్తుల స్థితిని అడిగి తెలుసుకున్నారు.
సీఎం ప్రజావాణికి సంబంధించిన అన్ని దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని అన్నారు.
4,880 అర్జీలకు పరిష్కారం
2026 మే నుంచి అక్టోబర్ వరకు జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 5,943 అర్జీలు స్వీకరించగా, వాటిలో 4,880 అర్జీలను పరిష్కరించినట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ కారణాలతో 1,063 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
జిల్లా అధికారులు ప్రతివారం టూర్ డైరీ సమర్పించాలి
అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ప్రతివారం తమ టూర్ డైరీ జిల్లా రెవెన్యూ అధికారికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రాబోయే వారంలో నిర్వహించవలసిన పనులపై అడ్వాన్స్ టూర్ ప్రోగ్రాం డైరీ సిద్ధం చేసుకోవాలని, వారం తర్వాత అధికారుల టూర్ డైరీని సమర్పించాలని తెలిపారు.
19న ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలి
ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిర్మాణం పూర్తయిన వివో గ్రామపంచాయతీ, అంగన్వాడి పాఠశాల తరగతి గదులు వంటి ప్రారంభోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలోనూ పనులు పూర్తయిన వివిధ భవనాల ప్రారంభోత్సవాలు ఉంటాయని అన్నారు.
ప్రజావాణికి 92 దరఖాస్తులు
సోమవారం ఐ డి ఓ సి లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 92 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు 19, గృహ నిర్మాణ సంస్థకు 16, కరీంనగర్ ఆర్డిఓ కార్యాలయానికి 12 దరఖాస్తులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి డిఆర్ఓ స్వామి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.