మెగా రైతు మేళాకు మిడ్జిల్ మండల రైతులు
ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన
మిడ్జిల్, నవంబర్ 9: వ్యవసాయ రంగంలో(Agricultural Sector) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం(Modern technology), నూతన సాగు విధానాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో నిర్వహించిన మెగా రైతు మేళా(Mega Farmers' Fair), ఇండస్ట్రియల్ ఎక్స్ పో(Industrial Expo)- 2026 కార్యక్రమానికి మిడ్జిల్ మండల రైతులు(Farmers of Midjil Mandal) తరలివెళ్లారు. పీఏసీఎస్ సీఈఓ బాల్రెడ్డి ఆధ్వర్యంలో మండలానికి చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతు మేళాలో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ టెక్నాలజీ, నూతన సాగు పద్ధతులు, వ్యవసాయ రంగంలో అందుబాటులోకి వస్తున్న సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించిన ప్రదర్శనలను సందర్శించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేందుకు ఉపయోగపడే ఆధునిక వ్యవసాయ విధానాలపై అవగాహన పొందారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుందని, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకునేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ గౌస్, సర్పంచ్ శంకర్, రాజు, నరేందర్ రెడ్డి, రమేష్, శ్రీను, రాముగౌడ్, లక్ష్మణ్, జహంగీర్, యాదయ్య, నిరంజన్, శేఖర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.