ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
తాడ్వాయి,నవంబర్,17 ( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యువకులు మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు(MLA K. Madan Mohan Rao) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ...ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA K. Madan Mohan Rao) అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చూసి తాము కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. యువతకు ఆయన సమన్యాయం చేస్తున్నారని వివరించారు.కాంగ్రెసులో చేరిన వారిలో బజరంగదళ్ అధ్యక్షులు బాలకృష్ణ,సంపత్,శివ, సురేష్,దేవేందర్,రంజిత్, భాస్కర్,రాకేష్ లతో పాటు మరికొందరు ఉన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పైడి రాజేశ్వర్ రెడ్డి,గ్రామ అధ్యక్షులు తూర్పు రాజేంద్రప్రసాద్,సర్పంచు రాజా గౌడ్,భోగ నరేందర్,అంబీర్ వరుణ్ రావు,అశోక్,రజినీకాంత్ తదితరులు ఉన్నారు.