పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్

17-11-2026 | 08:36pm

చెక్కులు పంపిణీ చేసిన సుడా మాజీ చైర్మన్ 

ముకరంపుర, నవంబర్ 17(విజయ క్రాంతి): పేద,మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి(Chief Minister's Relief Fund) కొండంత అండగా నిలుస్తోందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.ముకరంపుర లోని తన కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు మొత్తం 20 లక్షల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 3 సంవత్సరాల క్రితం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా ఇప్పటి వరకు 3 కోట్ల పైచిలుకు విలువగల చెక్కులు పంపిణీ చేసి ఒక వెయ్యి పైగా కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు.

వివిధ అనారోగ్య సమస్యలతో, ప్రాణాంతక వ్యాధులతో కార్పోరేట్,ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేద,మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపద్భందువులా అండగా నిలుస్తోందని నరేందర్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో గుండాటి శ్రీనివాస్ రెడ్డి,  షబానా మహమ్మద్, కుర్ర పోచయ్య,ఎండి షెహన్షా,రమణారెడ్డి,సుదర్శన్,ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు