అటకెక్కిన ప్రతిపాదనలు
కొత్త పీఏసీఎస్‌ల కోసం ఏడాదిగా ఎదురుచూపు
కరీంనగర్, నవంబర్ 17 (విజయక్రాంతి): కరీంనగర్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (కేడీసీసీబీ(KDCCB)) 1921లో ఏర్పడింది. ప్రస్తు తం దీని పరిధిలో కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలతో(Peddapalli District) పాటు కొంత భాగం.. జయశంకర్ భూపాల్పల్లి, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలున్నాయి. వీటి పరిధిలో 135 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(Primary Agricultural Cooperative Societies) (పీఏసీఎస్)లు నడుస్తున్నాయి. అందులో 132 సొసైటీలు కేడీసీసీబీ పరిధిలో ఉండగా.. మూడు సొసైటీలు మాత్రం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(State Bank of India) పరిధిలో ఉన్నాయి.
ఇవే కాకుండా బీ కేటగిరి పరిధిలో 250 నేత, చేనేత సంఘాలు, మరో 150 లేబర్, ఎంప్లాయిమెంట్, కళాకారుల సహకార సంఘాలున్నాయి. ఏడాది క్రితం 40 కొత్త పి ఏ సి ఎస్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు.కరీంనగర్ జిల్లా లో ప్రస్తుతం 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. కొత్తగా ఎనిమిది ప్రాంతాల్లో ఎలగందుల, చల్లూరు, ఇందుర్త్తి, గన్నేరువరం, గుండ్లపల్లి, బొమ్మకల్, రాములపల్లిలో ప్రతిపాదించారు. ప్రస్తుతం బొమ్మకల్ కరీంనగర్ కార్పొరేషన్ లో విలినమైంది.
రాజన్నసిరిసిల్ల జిల్లా లో ప్రస్తుతం 24 సంఘాలున్నాయి. కొత్తగా తొమ్మిది ప్రాంతాల్లో చెక్కపల్లి తంగళ్లపల్లి, బద్దెనపల్లి, నిమ్మపల్లి, వీర్నపల్లి, పె ద్దలింగాపూర్, కందికట్కూర్, రుద్రంగి, నర్సింగపూర్‌లో ప్రతిపాదించారు.జగిత్యాల జిల్లాలో 51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. కొత్తగా ఐదు ప్రాంతాలైన జాబితాపూర్, బుగ్గారం, మద్దునూరు, ధర్మారాజుపల్లె, సతారాం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.పెద్దపల్లి జిల్లా: ఇప్పటికే 20 సంఘాలుండగా కొత్తగా ఏడు చోట్ల కొలనూర్, రత్నాపూర్, గుంజపడుగు, వెంకటాపూర్, పుట్నూర్, అంతర్గాం, దొంగతుర్తిలో ప్రతిపాదించారు.
పూర్వ కరీంనగర్ జిల్లా విభజన జరిగినప్పుడు పలు మండలాలు ఆయా జిల్లాల్లోకి వెళ్లినప్పటికి సహకార సంఘాలు మాత్రం కె డి సి సి బి పరిధిలోనే ఉండటంవల్ల .సిద్దిపేట జిల్లాలో చూస్తే గతంలో పూర్వ జిల్లాకు చెందిన నాలుగు సహకార సంఘాలుండగా, ప్రస్తుతం కొత్త గా మూడు అంటే.. అక్కన్నపేట, రామవరం, వండ్లూరు బేగంపేటను ప్రతిపాదించారు.
అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నాలుగు ఉండగా.. కొత్తగా మరో నాలుగు ధన్వాడ, బోర్లగూడెం, కొయ్యూరు, పలిమెలను ప్రతిపాదించారు. అలాగే హన్మకొండ జిల్లాకు సంబంధించి పూర్వజిల్లాకు చెందిన రెండు సహకార సంఘాలు ఉండగా, అక్కడ మూడు కొత్తగా శనిగరం, మర్రిపల్లిగూడెం, తిమ్మాపూర్‌ను ప్రతిపాదించారు. ఒక పక్క ఎన్నికలు జరపక పోవడం కొత్త సంఘాల ఏర్పాటు ఆటకెక్కడంతో సహకార వ్యవస్థ దెబ్బతేనే ప్రమాదం ఏర్పడింది