గుడుంబా తయారీలో కొత్త పుంతలు

15-11-2026 | 08:30pm
  1. నాటు సారా తయారీకి ‘డెక్స్ట్రోజ్’..!
  2. పంచదార, బెల్లం బదులుగా వినియోగం.?
  3. గుర్తించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

మహబూబాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): నాటు సారా తయారీకి(Production of country liquor) ప్రధానంగా వినియోగించే బెల్లం, పంచదార లభించకుండా ఎక్సైజ్, పోలీస్ శాఖ(Excise and Police Department) ఇటీవల తనిఖీలు ముమ్మరం చేయడంతో గుడుంబా తయారీదారులు పంచదార, బెల్లం బదులు కేకుల్లో వినియోగించే  ‘డెక్స్ట్రోజ్’అనే తీపి పదార్థాన్ని ‘ఆన్లైన్’ ద్వారా తెప్పించి వినియోగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ(Excise Department) ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు.

గత మూడు రోజుల నుండి మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) పరిధిలో గుడుంబా తయారీ స్థావరాలపై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నిర్వహిస్తున్న దాడుల్లో ఆదివారం తొర్రూరు పరిధిలో ఈ విషయాలు వెలుగు చూసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి(Avinash Mohanty) తెలిపారు. హైదరాబాదు నుంచి ప్రత్యేకంగా నాలుగు స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ లు, ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్, స్థానిక పోలీసు బృందాలతో కలిసి మహబూబాబాద్ తొర్రూరు మండలాల్లో 42 ప్రాంతాల్లో ప్రత్యేక హోదాను నిర్వహించారు.

ఈ దాడుల్లో 64 కేసులు నమోదు చేసి 36 మందిని అరెస్టు చేసి మరో 40 మందిని బైండోవర్ చేశారు. 217 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని 9,450 లీటర్ల నాటు సారా తయారీకి సిద్ధం చేసిన ద్రావణాన్ని నేలపాలు చేశారు. 565 కేజీల బెల్లం, 25 కేజీల పటిక, ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో జాయింట్ కమిషనర్ అంజన్ రావు, డిప్యూటీ కమిషనర్ దత్తరాజ్ గౌడ్ అసిస్టెంట్ కమిషనర్ నవీన్ కుమార్, ఈఎస్ కరంచంద్ పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటు సారా తయారీ ని పూర్తిగా అరికట్టడమే ఎక్సైజ్ శాఖ లక్ష్యమని, మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ తయారవుతున్న నాటు సారాను పూర్తిస్థాయిలో నిర్మూలిస్తామని, ఎవరు ఎన్ని కొత్త పుంతలు తొక్కిన కనిపెట్టి నిర్మూలిస్తామని, కల్తీ కల్లు వినియోగించే పదార్థాలపై దాడులు కూడా చేస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి తెలిపారు.

మరిన్ని వార్తలు