ఘనంగా దొడ్డి కొమురయ్య సినిమా పోస్టర్ ఆవిష్కరణ

15-11-2026 | 08:39pm

32 మంది సహనిర్మాతలకు సన్మానం.. వెయ్యి మందితో ర్యాలీ

తిరుమలాయపాలెం, నవంబర్ 15 (విజయక్రాంతి) : కూసుమంచి మండల(Kusumanchi Mandal) కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట(Telangana Peasant Armed Struggle) తొలి అమరుడు దొడ్డి కొమురయ్య(Doddi Komuraiah) జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా రెండో వాల్ పోస్టర్‌ను(Wall poster) ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం(Statue of Ambedkar) నుంచి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Government Zilla Parishad High School) వరకు వెయ్యి మందితో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాలేరు నియోజకవర్గానికి చెందిన 32 మంది సహనిర్మాతలను శాలువాలు, ప్రశంసాపత్రాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయాలని, ఆయన పేరుతో రాష్ట్రస్థాయి అవార్డులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు, యువత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు