అల్లం సోదరులను పరామర్శించిన జీవగడ్డ మిత్రులు

15-11-2026 | 08:41pm

మంథని, నవంబరు 15(విజయక్రాంతి): తెలుగు సాహిత్యంలో(Telugu Literature) తమ రచనలతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ రచయితలు అల్లం రాజయ్య, అల్లం వీరయ్య, అల్లం నారాయణల మాతృమూర్తి అల్లం బుచ్చవ్వ (96) మృతి పట్ల జీవగడ్డ మిత్రులు సంతాపం వ్యక్తం చేశారు.  మంథనికి(Manthani) సమీపంలోని గాజులపల్లి గ్రామంలో అల్లం బుచ్చవ్వ(Allam Buchavva) అంత్యక్రియల అనంతరం ఆమె కుమారులైన అల్లం సోదరులను జీవగడ్డ మిత్రులు పరామర్శించారు.

ఈ సందర్భంగా బుచ్చవ్వ చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కథలు, నవలలు, కవితలు, పాటల రచనల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసిన అల్లం సోదరులకు మాతృవియోగం తీరని లోటని పేర్కొన్నారు. పరామర్శించిన వారిలో జీవగడ్డ మిత్రులు నెల్లుట్ల వాసుదేవరావు, వై.ఎస్. శర్మ, ఆవునూరి సమ్మయ్య ఉన్నారు.

మరిన్ని వార్తలు