సొసైటీ ర్యాంపుల్లో చీకటి ఒప్పందాలు!

18-11-2026 | 05:10am
  1. సింగిరెడ్డిపల్లిలో గోదారమ్మ గర్భగోష.. జానంపేటలో ఇసుక తవ్వకాల దందా!
  2. ఒక పంచాయతీ పేరుతో ర్యాంపు అనుమతులు.. మరో రెవెన్యూ పరిధిలో తవ్వకాలు!
  3. సింగిరెడ్డిపల్లికి మాత్రమే పర్మిషన్.. జానంపేట పరిధిలో ఇసుక తవ్వకాలపై అనుమానాలు!
  4. భూపతిరావుపేటలో డంపింగ్.. జానంపేట మీదుగా రవాణా?
  5. సొసైటీల ముసుగులో తెరవెనుక రాజకీయ, వ్యాపార పెత్తనమా?
  6. మైనింగ్, రెవెన్యూ శాఖలు స్పందించేదెప్పుడు? 
  7. క్షేత్రస్థాయి విచారణకు ప్రజల డిమాండ్. 

పినపాక, నవంబర్ 17,( విజయక్రాంతి): గోదావరి నది(Godavari River) ఇసుక సంపదపై అక్రమార్కుల(wrongdoers) కన్ను పడిందా? గిరిజన సొసైటీలకు(Tribal societies) జీవనోపాధి కల్పించాల్సిన ఇసుక ర్యాంపులు కొందరి వ్యాపార ప్రయోజనాలకు వేదికలుగా మారుతున్నాయా? పినపాక మండల పరిధిలోని సింగిరెడ్డిపల్లి ఇసుక ర్యాంపు(Singireddypalli Sand Ramp) వ్య వహారం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక పంచాయతీ పేరుతో ప్రభుత్వ అనుమతులు(Government Approvals) పొందుతూ, మరో రెవెన్యూ(Revenue) పరిధిలో ఇసుక తవ్వకాలు(Sand mining) చేపడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీ యాంశమవుతున్నాయి. అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట.. ఇసుక నిల్వలు ఇంకోచోట అన్నట్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై సంబంధిత శాఖల అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

అనుమతులు సింగిరెడ్డిపల్లికి.. తవ్వకాలు జానంపేటలోనా?

సింగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఇసుక ర్యాంపు నిర్వహణకు మాత్ర మే ప్రభుత్వ అనుమతులు జారీ అయినట్లు సమాచారం. అయితే వాస్తవంగా ఇసుక తవ్వకాలు మాత్రం జానంపేట రెవెన్యూ పరిధిలో జరుగుతు న్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ర్యాంపునకు అనుమతి ఇచ్చిన ప్రాంతం ఒకటి కాగా, ఇసుకను వెలికితీస్తున్న ప్రాంతం మరొకటి కావడం పలు సందేహాలకు తావిస్తోంది.

ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న సరిహ ద్దులు, తవ్వకాలకు అనుమతించిన భౌగోళిక ప్రాంతం, వాస్తవంగా తవ్వకాలు జరుగుతున్న ప్రదేశం ఒకటేనా? కాదా? అన్నది అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. సింగిరెడ్డిపల్లి పంచాయతీకి మాత్రమే అనుమతి ఉన్నప్పుడు జానంపేట రెవెన్యూ పరిధిలో తవ్వకాలు ఎలా జరుగుతున్నాయి? వాటికి ప్రత్యేక అనుమతులు ఉన్నాయా? లేక అనుమతుల పరిధిని దాటి కార్యకలాపాలు సాగు తున్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒకచోట ర్యాంపు.. మరోచోట డంపింగ్!

సింగిరెడ్డిపల్లి పేరుతో ర్యాంపునకు అనుమతులు పొందినప్పటికీ, అక్కడి నుంచి ఇసుక తరలింపునకు మార్గం లేకపోవడంతో భూపతిరావుపేట వద్ద ఇసుక నిల్వలు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. అక్కడి నుంచి జానంపేట మీదుగా ఇ సుక వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అసలు భూపతిరావుపేట వద్ద డంపింగ్కు అనుమతులు ఉ న్నాయా? ఆ భూమి వినియోగానికి రెవె న్యూ శాఖ నుంచి అనుమతి తీసుకున్నారా? ర్యాంపు అనుమతుల్లో ఈ నిల్వ ప్రాంతాన్ని పేర్కొన్నారా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అనుమతులు ఒక ప్రాంతానికి ఉండి, ఇసుక నిల్వలు మరో ప్రాంతంలో ఏర్పాటు చేస్తే దానికి సంబంధించిన నిబంధనలు ఏమిటన్నది అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.

గోదారమ్మ గర్భాన్ని గుల్ల చేస్తున్నారా?

ఇసుక తవ్వకాల వల్ల గోదావరి నది సహజ స్వరూపానికి నష్టం వాటిల్లుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అనుమతించిన పరిమాణంలోనే తవ్వకాలు జరుగు తున్నాయా? నదీ గర్భంలో తవ్వకాల లోతు ఎంత? విస్తీర్ణం ఎంత? యంత్రాల వినియోగం, పర్యావరణ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తున్నారా? అనే అంశాలపై శాస్త్రీయంగా పరిశీలన జరగాలి. నది సహజ ప్రవాహానికి, పరిసర ప్రాంతాల భూగర్భ జలాలకు, తీరప్రాంత గ్రామాలకు తవ్వకాల వల్ల ఎలాంటి ప్రభావం పడుతోందో అధికారులు అధ్యయనం చేయాలి. ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి వ్యాపార కార్యకలాపాలకే ప్రాధాన్యం ఇస్తే భవిష్యత్తులో పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సొసైటీల ముసుగులో తెరవెనుక పెత్తనమా?

గిరిజన, మత్స్యకార సొసైటీలకు కేటాయించిన ఇసుక ర్యాంపుల ద్వారా ఆయా సొసైటీ సభ్యులకు ఆర్థికంగా లబ్ధి చేకూరాలి. కానీ వాస్తవంగా ఇసుక వ్యాపారంలో పెట్టుబడులు ఎవరివి? యంత్రాలు ఎవరివి? ర వాణా, విక్రయాల నిర్వహణ ఎవరి చేతుల్లో ఉంది? సొసైటీ సభ్యులకు కేవలం కూలీ డబ్బులే అందుతున్నాయా? కోట్ల వ్యాపారంలో వచ్చే ఆదాయం, లాభాలు ఎవరికి వెళ్తున్నాయి? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. భూపతిరావుపేట ఇసుక డంపింగ్ వ్యవహారంలో అధికారులు నిష్పక్షపాతంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోవడంతో పాటు సొసైటీల రికార్డులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించినప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

జానంపేట మీదుగా రవాణా.. పత్రాలు ఉన్నాయా?

భూపతిరావుపేట వద్ద నిల్వ చేసిన ఇసుకను జానంపేట మీదుగా తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో రవాణా వ్యవస్థపై కూడా అధికారులు దృష్టి సారించాలి. ఇసుక వాహనాలకు అవసరమైన రవాణా పత్రాలు ఉన్నాయా? తరలిస్తున్న ఇసుక పరిమాణం ప్రభుత్వ రికార్డులతో సరిపోతుం దా? వాహనాల రాకపోకలకు అనుమతించిన మార్గం ఏది? రవాణా సమయంలో నిబంధనలు పాటిస్తున్నారా? డంపింగ్ ప్రాంతానికి సంబంధించి భూమి యజమానుల అనుమతులు, రెవెన్యూ శాఖ అనుమతులు ఉన్నాయా? అనే విషయాలను తనిఖీ చేయాల్సి ఉంది.

అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు?

ర్యాంపునకు అనుమతులు ఒక పంచాయతీ పేరుతో ఉండగా, తవ్వకాలు మరో రెవెన్యూ పరిధిలో జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నప్పటికీ మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అనుమతుల పరిధి ఎక్కడి వరకు ఉంది? వాస్తవంగా తవ్వకాలు జరుగుతున్న ప్రదేశం ఏ సర్వే నంబర్లలో ఉంది? అనుమతించిన విస్తీర్ణం ఎంత? తవ్విన ఇసుక పరిమాణం ఎంత? డంపింగ్కు, రవాణాకు ప్రత్యేక అనుమతులు ఉన్నాయా? అన్న వివరాలను ప్రజలకు వెల్లడించాలని కోరుతున్నారు.

సమగ్ర విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి!

సింగిరెడ్డిపల్లి ర్యాంపునకు జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు, అనుమతించిన తవ్వకాల ప్రాంతం, జానంపేట రెవెన్యూ పరిధిలో జరుగుతున్న తవ్వకాల స్థానం, భూపతిరావుపేటలో ఏర్పాటు చేసిన ఇసుక డంపింగ్ ప్రాంతం, జానంపేట మీదుగా జరుగుతున్న రవాణా మార్గం, వాహనాల రవాణా పత్రాలు, సొసైటీల ఆర్థిక లావాదేవీలపై మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే భూమి సర్వే, జీపీఎస్ ఆధారిత క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి అనుమతుల పరిధిని, వాస్తవ తవ్వకాల ప్రాంతాన్ని నిర్ధారించాలని కోరుతున్నారు.గోదావరి ఇసుక సంపద ప్రజల సహజ వనరు.

గిరిజన సొసైటీల అభివృద్ధి పేరుతో ఇతరుల వ్యాపార ప్రయోజ నాలు నెరవేరుతున్నాయా? సింగిరెడ్డిపల్లి పేరుతో అనుమతులు పొంది జానంపేట రెవెన్యూ పరిధిలో తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణల్లో వాస్తవమెంత? భూపతిరావుపేట డంపింగ్కు అనుమతులు ఉన్నాయా? అన్న ప్రశ్నలకు అధికారుల విచారణతోనే సమాధానం లభించనుంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అక్రమాలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు