పల్లెల్లో పొలిటికల్ హీట్
- మన నియోజకవర్గం పరిస్థితి ఏంటీ..?
- నియోజకవర్గాల పునర్వీభజన అంశంపై సర్వత్ర చర్చ
- గ్రామాల్లో రచ్చబండలు గా మారిన వీధులు
- నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. సర్వత్ర ఉత్కంఠ
ఖమ్మం, నవంబర్ 30(విజయక్రాంతి): పల్లెల్లో పొలిటికల్ హీట్ పెరిగింది.. ఏడాది తరువాత నియోజకవర్గ పునర్వీభజన(Delimitation of Constituencies) అంశం గ్రామాల్లో సర్వత్ర చర్చ జరుగుతోంది.. ఉమ్మడి ఖమ్మం జిల్లా(Khammam District) వ్యాప్తంగా రాజకీయ చర్చ ప్రారంభమైంది.. గ్రామాల్లో ప్రజలందరు డీలిమిటేషన్(Delimitation) పై చర్చించుకుంటున్నారు. లక్షలాధి మంది ప్రజలు పార్లమెంట్ సమావేశాలపై(Parliament sessions) అసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధాహరణ ఎన్నికలు జరిగి మూడేళ్లు గడిచిన తరువాత అదే స్థాయి రాజకీయ ప్రచారం మరోసారి గ్రామాలను చుట్టేస్తోంది.
పునర్వీభజన బిల్లు పార్లమెంట్(Reorganization Bill in Parliament) లో పాస్ అవుతుందా..? సరిపోయిన బలం ఉందా..? లేదా..? ఉంటే..? బిల్ పాస్ అయితే మన నియోజకవర్గం పరిస్థితి ఏంటి..? మన మండలం ఏ నియోజకవర్గంలో ఉంటుంది.. మన నియోజకవర్గం మారుతుందా..? అసలు ఉంటుందా..? పోతుందా..? అనే అంశాలపై పల్లెల్లో రాజకీయ చర్చ సర్వత్ర ఉత్కంఠను రేపుతోంది.. మరి కొన్ని గంటల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో రాజకీయ చర్చ తీవ్రమైంది.
గ్రామాల్లో, తండాల్లో ఎక్కడ చూసిన పునర్వీభజన బిల్లు పై చర్చ జరుగుతుండటం విశేషం.. అయితే నియోజకవర్గాల పునర్వీభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నేలకొంది. ప్రజలు, రాజకీయ నాయకులు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడేప్పుడు పార్లమెంట్ లో చర్చ జరుగుతుందా..? అని వేచి చూస్తున్నారు.
నియోజకవర్గాల పునర్వీభజన, మహిళ రిజర్వేషన్ బిల్లు విషయంలో పార్లమెంట్ లో ఒక సారి ఓటమి చెందిన కేంద్ర ప్రభుత్వం.. ఆ బిల్లులను పాస్ చేయించుకునేందుకు పట్టుబడుతుంది.. అందుకు కావాల్సిన రాజకీయ సమీకరణాలను మార్చుకున్న కేంద్ర ప్రభుత్వం ఉన్నఫలంగా అత్యవసర సమావేశాలకు పిలుపునిచ్చింది..ఈ నెల 30 నుంచి డిసెంబర్ 3 వరకు అత్యవసర పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక్క సారిగా గ్రామీణ స్థాయిలో పొలిటికల్ హీట్ పెరిగింది.
నియోజకవర్గాల పునర్వీభజనకు సంబంధించిన అంశం కావడంతో గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు రాజకీయ అంశంపై చర్చ జరుగుతోంది. పొలిటికల్ లీడర్లు, కార్యకర్తలు, ప్రజలు, విశ్లేషకులు చాలా ఉత్కంఠగా పార్లమెంట్ సమావేశాల కోసం ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏం జరగబోతుందనే విషయాన్ని క్షుణంగా పరిశీలిస్తున్నారు. గ్రామీణ ప్రజలు మాత్రం వీధుల్లో, రచ్చబండల్లో పునర్వీభజన పై చర్చించుకుంటున్నారు. బిల్లు పాస్ అవుతుందని, కొందరు, కేంద్రానికి బలం లేదని మరికొందరు, మన మండలం మారుతుందంటా..? అని ఇంకోందరు చర్చించుకోవడం గమనర్హం.
మా నియోజకవర్గం పరిస్థితేంటి..?
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయితే మా నియోజకవర్గం పరిస్థితేంటని..? ప్రజలు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు లెక్కలేసుకుంటున్నారు. మా నియోజకవర్గం మారుతుందా..? పక్క నియోజకవర్గం పరిస్థితి ఏంటి..? ఉన్న నియోజకవర్గాల పరిస్థితి ఏంటి..? నియోజకవర్గాల పేర్లు మారతాయా..? నియోజకవర్గాల సరిహద్దు పరిస్థితి ఏలా ఉండబోతుంది.. మా నియోజకవర్గం జనరల్ అవుతుందా..? ఉన్న రిజర్వేషన్ తిరిగి కొనసాగుతుందా..? లేదంటే మహిళలకు కేటాయిస్తారా..? అనే విషయాలపై గ్రామీణ స్థాయిలో చర్చ జరుగుతుండటం గమనర్హం. రాజకీయ విశ్లేషకులు, ప్రథమ శ్రేణి నాయకత్వం, ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం అనేక రకాలుగా లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది..
పునర్వీభజన జరిగితే మారనున్న రూపురేఖలు...?
నియోజకవర్గాల పునర్వీభజన జరిగితే కచ్చితంగా జిల్లా సరిహద్దులు, నియోజకవర్గాల్లో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.. 2009లో జరిగిన పునర్వీభజన ఇష్టానుసారంగా చేయడం, ఒక జిల్లాలో ఉన్న మండలాలను, మరో జిల్లాలోని నియోజకవర్గంలో కలపడం, గ్రామాలను మండలాల నుంచి వీడదీయడం, నియోజకవర్గాలకు అందనంతా దూరంలో ఉంచడం వల్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే రాబోయే పునర్వీభజనలో కచ్చితంగా జిల్లాలు, నియోజకవర్గాల రూపురేఖలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిహద్దులు, మండలాల చేర్పులు మార్పులు, నియోకజవర్గాల పేర్లు మారే అవకాశం కచ్చితంగా ఉందనే చెప్పాలి.. 19వ శతాబ్దంలో ఏర్పడిన నియోజకవర్గాల పేర్లను సైతం మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ప్రజలకు అవసరాలు తీరే పట్టణాలు, పట్టణ వాతావరణ కల్గిన మండలాలు, గ్రామాల పేర్లను నియోజకవర్గ కేంద్రాలుగా మార్చే అవకాశాలు ఉన్నాయి.