రెడ్డివారి ఫంక్షన్ హాల్, హాస్టల్ నిర్మాణానికి కృషి

29-11-2026 | 07:19pm

పాలేరు నియోజకవర్గ రెడ్డి సంఘం వారి కార్తీక మాస వన సమారాధనలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి

ఏదులాపురం : రెడ్డివారి ఫంక్షన్ హాల్, హాస్టల్  నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా.. చాలాకాలంగా తనకు విజ్ఞప్తులు వస్తున్నాయని.. పాలేరు నియోజకవర్గంలో(Palair Constituency) త్వరలోనే వీటి నిర్మాణం కోసం భూ కేటాయింపు చర్యలు చేపడతామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) హామీ ఇచ్చారు.

ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీలోని(Edulapuram Municipality) మామిండ్ల నిరంజన్ రెడ్డి మామిడి తోటలో పాలేరు నియోజకవర్గ రెడ్డి సంఘం వారి కార్తీక మాస వన సమారాధన మహోత్సవానికి ఖమ్మం- నల్లగొండ - వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. జిల్లా సంఘం ఆధ్వర్యంలో కాకుండా ఈసారి ప్రత్యేకంగా పాలేరు నియోజకవర్గ పరిధిలో ఇలా వన సమారాధన జరగడం, నిర్వాహకులు చక్కటి ఏర్పాట్లు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. కచ్చితంగా తన పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే వారంతా.. ఇలా ఒక చోటుకు చేరి యోగక్షేమాలు తెలుసుకోవడం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం బాధ్యులు రామసహాయం నరేశ్ రెడ్డి, ఏదులాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, కాంగ్రెస్ పార్టీ ఏదులాపురం మున్సిపాలిటీ అధ్యక్షులు బానోత్ కిషోర్ నాయక్, రెడ్డి సంఘం నాయకులు సోమ వెంకటరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ మద్దిమల్లారెడ్డి, తోట చిన్న వెంకటరెడ్డి, మారెళ్ళ వెంకట్రామిరెడ్డి, మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, రామసహాయం బాలకృష్ణారెడ్డి, రమేష్ రెడ్డి, కంచర్ల జీవన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు