ఆదిమ గిరిజనులకు ప్రభుత్వ పథకాలు వేగంగా అందించాలి
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆదిమ గిరిజనుల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం జన్మన్, పీఎం జూగా పథకాలను అర్హులైన లబ్ధిదారులకు వేగంగా అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(Asifabad Collector Haritha) అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఐటీడీఏ పీవో మంద మకరంద్తో కలిసి పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్, గృహ వసతి వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఐటీడీఏ పీవో మంద మకరంద్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ జాదవ్ అంబాజీ పథకాల అమలు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్, ఆర్డీవో లోకేశ్వర్, ఏపీవో ఆత్రం భాస్కర్, గిరిజన సంఘాల నాయకులు సిడాం అర్జు మాస్టర్, ఆత్రం భీంరావ్, కుర్సెంగా మోతిరామ్, కోవా విజయ్, సిడాం శంకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.