ఓటరు చైతన్యంతో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి

17-11-2026 | 08:51pm

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(Collector K. Haritha) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలకు అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మట్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.వ్యాసరచన పోటీల్లో బి.సుహాన్ రాజ్, జి.ఇందు, యు.ఉమాన, షేక్ షిఫా, డి.వైష్ణవి, ఎస్.అంజలి, బి.గీత, బి.హర్షిత, ఆర్.శివసాయి, ఎం.సింధు టాప్-10 బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికయ్యారు.

క్విజ్ పోటీల్లో కె.శ్రీనివాస్, జి.లోకేష్, గుండా విష్ణుతేజ, ఈ.వినయ్, కె.అంజన, కె.శ్రీహర్ష, పి.హర్షల్, ఎస్.ఆశ్రిత, బి.ప్రావణ్య, బి.మనీష ప్రతిభ కనబరిచారు. విజేతలకు కలెక్టర్ ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎన్నికల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు