11వ వార్డులో పింఛన్ల పంపిణీ
17-11-2026 | 05:23pm
ఆసిఫాబాద్ (విజయక్రాంతి):ఆసిఫాబాద్ మున్సిపాలిటీ(Asifabad Municipality) పరిధిలోని 11వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ (Distribution of pensions) చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య(Municipal Commissioner Anjaiah) లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు కస్తూరి నిఖిల్, శానిటరీ ఇన్స్పెక్టర్ రామయ్య, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.