ట్రస్ట్ ఆధ్వర్యంలో రాగి జావా, పాయసం పంపిణీ
జగిత్యాల, నవంబర్ 17 ( విజయ క్రాంతి ): కొండగట్టులో(Kondagattu) జరిగే చందనోత్సవ వేడుకల సందర్భంగా అఖండ చాలీసా పారాయణ సేవ(Akhanda Chalisa Parayana Seva), ఆలయ ట్రస్ట్ భక్తులకు మధ్యాహ్నం, రాత్రి భోజన ఏర్పాట్లు చేయగా ఈ విషయం తెలుసుకున్న శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్(Sathya Sai Annapurna Trust) రాష్ట్ర కో-ఆర్డినేటర్ వూటూరి శ్రీకాంత్.
వెంటనే స్పందించి ఈ.ఓ. అనుమతితో ఉదయం 200 మంది భక్తులకు పోషకాహారంతో కూడిన ఉదయపు అల్పాహార పానీయంగా రాగి జావ అందించడానికి ముందుకు వచ్చారు. ఈ రోజు 250 మంది భక్తులకు రుచికరమైన పోషకాహార పానీయం రాగి బెల్లం పాయసం అందించారు. సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ప్రతినిధులు నరేష్, శివ, జీషాన్ లను అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఇవో అంజనా రెడ్డి, ఆలయ సిబ్బంది, ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.