రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
- రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణ
- ఎకరాకు రూ. 10వేల నష్టపరిహారం అందించాలి
- నిజాంపేట్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రం సందర్శన
నారాయణఖేడ్, నవంబర్ 17 : రాష్ట్రంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను(Government paddy Purchase Center) ఎక్కడ కూడా ఇప్పటికీ ప్రారంభించలేదని రాష్ట్ర మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు(Harish Rao) అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా వడ్ల కొనుగోలు కేంద్రాలను ఇప్పటికి ప్రారంభించలేదని ఆరోపించారు నాయకులు కేవలం కొబ్బరికాయలు కొడుతూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల పంట ఎండిపోయిన ఇప్పటికి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
నష్టపోయిన రైతులకు ఎకరానికి 10000 చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు సన్న వడ్ల వడ్లకు ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు ఇప్పటికి రెండు యాసంగి లకు సంబంధించిన బోనస్ డబ్బులను రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేయలేదని ఆరోపించారు.
సన్న వడ్లు పండించిన రైతులు క్వింటాలుకు 400 నుండి 300 రూపాయల వరకు నష్టపోతున్నారని అన్నారు దొడ్డుబడ్లు సాగుచేసిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులు పండించిన పంటలు గత 20 రోజుల నుండి కల్లాల వద్ద కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్న ఇప్పటివరకు ఒక్క కిలో వడ్లను సైతం కొనుగోలు చేయలేదని ఆరోపించారు.
ఇకనైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని మిల్లర్లను అలాట్మెంట్ చేసి మిల్లర్లను అటాచ్ చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 3,000 మంది రైతులు మరణించగా వారికి రైతు బీమా అందలేదని ఆరోపించారు. రైతు బీమాను మళ్ళి పేరు మార్చి ఇందిరాగాంధీ పేరు పెట్టి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
మరణించిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పక్క రాష్ట్రాలను చూసిన నేర్చుకోవాలని పక్క రాష్ట్రాల్లో ఎకరానికి రూ.5వేల చొప్పున కరువు సహాయం అందించారని ఆయన గుర్తు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వద్ద ఇప్పటికీ పంట నష్టం వివరాలు ప్రభుత్వం వద్ద లేవని ఆరోపించారు.
ఎల్నినో పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని అన్నారు. వెంటనే రైతులను ఆదుకోవాలని ఎక్కడ రూ 10 వేలు చొప్పున నష్టపరిహారం అందించాలని అన్నారు. సింగూరు ఎండి పోవడంతో జిల్లాలో తీవ్ర నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సింగూరు ఎండిపోవడం జరిగిందని ఆరోపించారు.
తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజం సాగర్ నుండి రివర్స్ పంపింగ్ ద్వారా సింగూరు నింపి హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాకు తాగునీటి అవసరాలను తీర్చాలని డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు నల్లవాగు నిజాంసాగర్ నుండి నీటిని సరఫరా చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
తమ ప్రభుత్వ హాయంలో వలస వెళ్లిన కూలీలు రైతులు రిటర్న్ వచ్చి పంటలను సాగు చేసుకోగా ప్రస్తుతం మళ్ళీ నారాయణఖేడ్ ప్రాంతం నుండి వలసలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. కాగా పలువు రు రైతులు కరెంటు ఇబ్బందులను హరీష్ రావుకు వివరించారు.
ఆయన వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అందోలు, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, ఎం.భూపాల్ రెడ్డి ఇతర నాయకులు ఉన్నారు. కాగా సంజీవనిలో పేటలో జీర్నోదరణ చేసిన అనంతపద్మనాభ స్వామి ఆలయ ఉత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలుకారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.