అల్లు అర్జున్ పుష్ప క్రేజ్

17-11-2026 | 05:22pm

పాట్నాలో రెండేళ్ల క్రితం అభిమానుల సందడి

2024 నవంబర్ 17న పాట్నా(Patna)లోని గాంధీ మైదాన్‌లో జరిగిన ఈ వేడుకకు అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న హాజరయ్యారు. తమ అభిమాన హీరోను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అభిమానుల సందడి మధ్య ఈవెంట్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. 

ఈ వేడుకలో అల్లు అర్జున్ హిందీలో మాట్లాడి బీహార్ అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనకు తొలిసారి బీహార్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. 'పుష్ప(Pushpa) ఎప్పుడూ తగ్గేదేలే.. కానీ మీ ప్రేమ కోసం ఈరోజు తగ్గుతాడు' అంటూ తనదైన స్టైల్‌లో చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. 

బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బన్నీ స్టైలిష్ లుక్, అభిమానుల కేరింతలు, ఆయన స్పీచ్.. ఇలా ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెండేళ్లు గడిచినా పాట్నా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మాత్రం అభిమానుల జ్ఞాపకాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

మరిన్ని వార్తలు