స్వచ్ఛభారత్ పనులను ప్రారంభించిన ఎంపీడీవో

17-11-2026 | 08:49pm

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): మండలంలోని ఎల్లారం, జెండాగూడ, ఇప్పలనావేగం గ్రామాల్లో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ పథకం(Swachh Bharat Mission (Grameen) Scheme) కింద మంజూరైన కమ్యూనిటీ సోక్‌పిట్, డ్రైనేజీ ఎండ్ పాయింట్ సోక్‌పిట్, బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణ పనులను ఎంపీడీవో శ్రీనివాస్ ముగ్గులు వేసి ప్రారంభించారు. గోవిందాపూర్ గుడిగూడ ఆవాసంలో  నిర్మించిన కమ్యూనిటీ సోక్‌పిట్లను పరిశీలించారు.

గ్రామాల్లో వ్యక్తిగత ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, పశువుల నీటి తొట్టెల నిర్మాణంతో పాటు పశుగ్రాసం పెంపకం పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు నీల, లక్ష్మి, ఎంపీవో మౌనిక, ఏపీవో బుచ్చన్న, సాంకేతిక సహాయకులు మారుతి, మల్లుబాయి, పంచాయతీ కార్యదర్శులు సరిత, జ్యోతి, క్షేత్ర సహాయకుడు రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు