బీమా చేసుకోండి.. ధీమాగా ఉండండి
మేనేజర్ సాయికుమార్
బెజ్జూర్, నవంబర్ 9 (విజయక్రాంతి ) : బెజ్జూర్ మండలంలోని(Bejjur Mandal) కుంటల మాలనేపల్లి గ్రామంలో కొండగట్టు స్వామి గ్రామ సంఘం పరిధిలోని సంఘాల సభ్యులకు ఆర్థిక అక్షరాస్యతపై(Financial Literacy) అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయికుమార్(Telangana Grameena Bank Manager Sai Kumar) తెలిపారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయికుమార్ మాట్లాడుతూ, మహిళా సంఘాల సభ్యులు, రైతులందరూ రుణాలు సక్రమంగా చెల్లించాలని సూచించారు.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన పథకాలలో అర్హత గల సభ్యులు నమోదు చేసుకోవాలని కోరారు.
లఖ్ పతి రుణాలు మంజూరు చేస్తామని, అర్హులైన సభ్యులు రుణాలు తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ ఓటీపీలు, బ్యాంక్ వివరాలు చెప్పి మోసపోవద్దని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్నేహ, ఫీల్డ్ ఆఫీసర్ వెంకట సాయి, సీసీ భద్రయ్య, ఎఫ్ఎల్ సీ కోఆర్డినేటర్ రాజబాబు, గ్రామ సంఘం అధ్యక్షురాలు అపర్ణ, వివోఏ సత్తయ్య, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.