డీప్‌టెక్‌కు అపార అవకాశాలు

05-11-2026 | 05:40am

పరిశ్రమలు, ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం 

రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి

  1. పారిశ్రామిక వేత్తలకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు 
  2. ప్రపంచస్థాయి డీప్‌టెక్ కేంద్రంగా తెలంగాణ: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  3. ఘనంగా ‘ఫిక్కీ’ వందేళ్ల వేడుకలు, డీప్‌టెక్ లీడర్‌షిప్ సమ్మిట్ 

నవంబర్ 4 (విజయక్రాంతి) : డీప్‌టెక్ రంగంలో(Deep-tech sector) సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలను(Research and Innovation) ప్రోత్సహిస్తూ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే తెలంగాణ ప్రభుత్వ(Government of Telangana) లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ విభాగాలు(Researchers, entrepreneurs, investors, government departments) సమన్వయంతో పనిచేసినప్పుడే ఆవిష్కరణలకు సార్థకత చేకూరుతుందన్నారు.

హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) వందేళ్ల వేడుకలు, తెలంగాణ డీప్‌టెక్ లీడర్‌షిప్ సమ్మిట్‌కు భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో(Duddilla Sridhar Babu) పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణను పెట్టుబడులు, పరిశ్రమల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తుందన్నారు.

2035 నాటికి రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పరిశ్రమలకు అనువైన విధానాలను రూపొందిస్తున్నట్లు వివరించారు. సాఫ్ట్‌వేర్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, ఇంజినీరింగ్ వంటి విభిన్న రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని, ఈ సామర్థ్యాలన్నింటినీ సమన్వయం చేయడం ద్వారా తెలంగాణ డీప్‌టెక్ రంగంలో ప్రపంచ స్థాయి ఆవిష్కరణలకు వేదికగా ఎదుగుతుందన్నారు. ఇంధనరంగంలో పునరుత్పాదక విద్యుత్ వి నియోగం, సరఫరా వ్యవస్థల పనితీరు మెరుగుదల వంటి అంశాల్లో ఆవిష్కరణలకు విస్తృత అవకాశాలున్నాయని వెల్లడించారు.  

గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం 

డీప్‌టెక్ అభివృద్ధి కేవలం పరిశోధకులు, సంస్థలకే పరిమితం కాకుండా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించాలని భట్టి స్పష్టం చేశారు. నూతన సాంకేతిక విధానాల అమలు, నిర్వహణ, మరమ్మతులకు నైపుణ్యమైన టెక్నీషియన్లు,ల్యాబొరేటరీ సిబ్బంది, కార్మికులను సిద్ధం చేయాలని పారిశ్రామిక వేత్తలకు సూచించారు. కుటుంబాల ఆదాయం పెరగడం,  యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆవిష్కరణల ఫలితాలు ఉండాలని ఆకాంక్షించారు.   

ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం

తెలంగాణను ప్రపంచస్థాయి డీప్‌టెక్, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. 2025-26లో రాష్ట్ర జీఎస్‌వీఏలో పారిశ్రామిక రంగం వాటా 8.1 శాతం వృద్ధి రేటుతో రూ.3.04 లక్షల కోట్లకు చేరిందని, రాష్ట్ర వస్తువుల ఎగుమతులు 39.3 శాతం పెరిగాయన్నారు. 2047 నాటికి తెలంగాణ ను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశ్రమలు, తయారీ రంగాల అభి వృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయనున్న ఏఐ, క్వాం టం టెక్నాలజీ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో సైతం పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృ ద్ధికి అవసరమైన మౌలిక సౌకర్యాలను రాష్ట్రంలో కల్పిస్తున్నట్లు చెప్పారు.

సమష్ఠి భాగస్వామ్యంతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని, రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ని పుణులు, ఆవిష్కర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఫిక్కీ వందేళ్ల ప్రస్థా నం భారత పారిశ్రామిక రంగ ప్రగతి, ప రిణామ క్రమానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫిక్కీ తెలంగాణ చాప్టర్ చైర్మన్ వి.వి. రామరాజు, కో -చైర్మన్ జయదేవ్ మీలా, ఎఫ్‌టీసీసీఐ ప్రె సిడెంట్ కే.కే.మహేశ్వరి, అపోలో హా స్పిటల్స్ ఎంటర్ ప్రైజెస్ జాయింట్ ఎండీ సంగీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు