వృద్ధులకు పెన్షన్ ఇవ్వాల్సిందే!

21-11-2026 | 12:22pm

సిర్గాపూర్, నవంబర్ 20 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని అర్హులైన వృద్ధులకు వృద్ధాప్య ఆసరా పెన్షన్లు, బోధకాలు ఉన్నవారికి పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంజీవ్ రావ్ పాటిల్ కోరారు. ఈ మేరకు ఎంపీడీవో ఆండాలమ్మకు వినతిపత్రం (Representation) సమర్పించారు. ఈ సందర్భంగా సంజీవ్ రావ్ పాటిల్ మాట్లాడుతూ.. మండల పరిధిలో పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వృద్ధులు, బోధకాలు ఉన్నవారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అర్హులందరికీ సామాజిక భద్రత (Social Security) కల్పించేలా తక్షణమే పెన్షన్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను విజ్ఞప్తి చేశారు.

దీనిపై ఎంపీడీవో ఆండాలమ్మ సానుకూలంగా స్పందిస్తూ.. వినతిపత్రాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు సంజీవ్ రావ్ పాటిల్ తెలిపారు.

మరిన్ని వార్తలు