పేరుకే ఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్!

18-11-2026 | 05:20am
  1. క్షేత్రస్థాయిలో అసౌకర్యాల నడుమ విద్యుత్ సిబ్బంది విధులు
  2. కార్యాలయాలకు సొంత భవనాలు కరువు..
  3. అద్దె గదులు, సబ్స్టేషన్లే దిక్కు
  4. విద్యుత్ బకాయిల వసూళ్లకు బిల్ కౌంటర్లు లేవు..
  5. వినియోగదారులకూ తప్పని ఇక్కట్లు

మహబూబాబాద్, నవంబర్ 17(విజయక్రాంతి): విద్యుత్ రంగంలో(Power Sector) ఆధునికీకరణ, సాంకేతిక పరిజ్ఞానం(Modernization and technological knowledge), కార్పొరేట్ హంగుల గురించి గొప్పగా చెప్పుకుంటున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(Northern Telangana Electricity Distribution Company) (ఎన్పీడీసీఎల్) క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విద్యుత్ సరఫరా వ్యవస్థను(Power supply system) నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ అందించేందుకు అహర్నిశలు శ్రమించే క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి(Officials, employees, and staff) కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంస్థ కార్పొరేట్ రూపు సంతరించుకున్నా.. క్షేత్రస్థాయి కార్యాలయాల పరిస్థితుల్లో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కార్యాలయాలకు సొంత భవనాలేవీ?

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వి ద్యుత్ శాఖ పరిధిలోని ఎలక్ట్రికల్ అసిస్టెంట్ డివిజన్ కార్యాలయాలు, మండల స్థాయి ఇంజనీరింగ్ అధికారుల కార్యాలయాలకు సరైన సొంత భవనాలు లేకపోవడం సమస్యగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అద్దె భవ నాల్లో కార్యాలయాలు నిర్వహిస్తుండగా, మరికొన్ని చోట్ల విద్యుత్ సబ్స్టేషన్లలోనే కా ర్యాలయ కార్యకలాపాలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది.

సిబ్బందికి సరైన వసతి, కార్యాలయ నిర్వహణకు అనువైన గదులు, రికార్డుల భద్రతకు తగిన స్థలం వంటి సదుపాయాలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నా యని చెబుతున్నారు. ప్రజల విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపాల్సిన కార్యాలయా లే కనీస వసతుల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

బకాయిల వసూళ్లకు బిల్ కౌంటర్లు కరువు!

విద్యుత్ వినియోగదారుల నుంచి బిల్లుల వసూళ్లు, పాత బకాయిల చెల్లింపుల కోసం సులభమైన వ్యవస్థ అందుబాటులో ఉండా ల్సి ఉంది. అయితే జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రత్యేక బిల్ కౌంటర్లు లేకపోవడం వినియోగదారులకు ఇబ్బందిగా మారుతోంది. బిల్లులు చెల్లించేందుకు, బకాయిల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు లేకపోవడం, ప్రతినెల బిల్లు వసూలు చేసే సిబ్బంది ప్రైవేటు వ్యక్తులకు చెందిన మిల్లు ను లేదంటే షాపుల వద్ద ‘అడ్డా’ ఏర్పాటు చేసుకుని బిల్లులు వసూలు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రత్యక్షంగా చెల్లించాలనుకునే వారికి స్థానికంగా తగిన ఏర్పాట్లు లేకపోవడం సమస్యగా మారుతోంది.

సిబ్బందిపై పని ఒత్తిడి.. వసతులపై నిర్లక్ష్యం!

విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు, ట్రాన్స్ఫార్మర్లు మొరాయించినప్పుడు, లైన్లలో సాంకేతిక లోపాలు తలె త్తినప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందే ముందుగా స్పందించాల్సి ఉంటుంది. ఎండ, వాన, రాత్రి పగలు అనే తేడా లేకుండా విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యే సిబ్బందికి అవసరమైన కార్యాలయ వసతులు, పరికరాల భద్రత, విధుల నిర్వహణకు అనుకూలమైన వాతావరణం కల్పించడం సంస్థ బాధ్యత. కానీ కార్యాలయాల నిర్వహణకే సరైన వసతులు లేకపోతే ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కార్పొరేట్ హంగులకే పరిమితమా?

విద్యుత్ సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, వినియోగదా రులకు మెరుగైన సేవలు అందించడం ఎంత ముఖ్యమో.. ఆ సేవలను క్షేత్రస్థాయిలో అందించే సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా అంతే ముఖ్యం. కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించడం, అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలకు అనువైన వసతులు కల్పించడం, సబ్స్టేషన్లలో నిర్వహిస్తున్న కార్యాలయాలను సౌకర్యవంతమైన ప్రదేశాలకు తరలించడం, అవసరమైన చోట బిల్ కౌంటర్లు ఏర్పాటు చేయడంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

కార్పొరేట్ హోదా, ఆధునిక సాంకేతికత, డిజిటల్ సేవలు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోనూ ప్రతిఫలించాలి. విద్యుత్ సిబ్బందికి సౌకర్యాలు కల్పిస్తేనే వారి పనితీరు మరింత మెరుగుపడటంతోపాటు వినియోగదారులకు సత్వర సేవలు అందే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు మహబూబాబాద్ జిల్లా కార్యాలయాల పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించి, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, వినియోగదారులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు