భూత్పూర్‌లో గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

17-11-2026 | 01:12pm

భూత్పూర్:  శ్రీశ్రీశ్రీ గురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో(Gurumurthy Swamy Brahmotsavam) భాగంగా నిర్వహించిన ఉద్దాల చాట(Uddala Chat Festival) ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో కౌన్సిలర్లు, మండల ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు కౌన్సిలర్  పద్మ, పెద్ద తండా గ్రామ సర్పంచ్ సుశీల, చౌల తండా సర్పంచ్ మన్ని, కో ఆప్షన్ నెంబర్ ఆగిరి లావణ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్, రెడ్డినాయక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు