యాసంగిలో పంటల మార్పిడికి రైతులు మొగ్గు చూపాలి

17-11-2026 | 01:09pm

మండల వ్యవసాయ అధికారి బి. రామకృష్ణ

చేర్యాల: ఎల్-నినో ప్రభావం కారణంగా రాబోయే యాసంగి(Yasangi)లో వర్షపాతం తక్కువ ఉండే అవకాశం ఉన్నందున రైతులందరూ(Farmers ) పంట మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వాలని మద్దూరు మండల వ్యవసాయ అధికారి బి. రామకృష్ణ(Mandal Agriculture Officer B. Ramakrishna) పిలుపునిచ్చారు.అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు.ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో వరి సాగు విస్తీర్ణంలో కనీసం 25 శాతం విస్తీర్ణాన్ని పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగుకు మళ్లించాలని తెలిపారు.

ఈ యాసంగిలో రైతులు శనగ, కంది, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, నువ్వులు, కూరగాయలు వంటి పంటలు సాగు చేసుకోవాలని కోరారు.పంటల మార్పిడిలో భాగంగా యాసంగిలో ప్రతి రైతు సాగు చేస్తున్న పంట విస్తీర్ణం, పంట రకం, అవసరమైన సదుపాయాల వివరాలను ఏఈవోకు అందించి క్రాప్ డేటా పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.ఉద్యాన పంటల సాగు చేసే రైతులు డ్రిప్, స్ప్రింక్లర్లు, మల్చింగ్ కవర్లు, అలాగే పందిళ్లు, కూరగాయల కోసం రైతులు కూడా ఆన్ లైన్ లో సాగు వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు