మొక్కలే కదా.. ఏమౌద్ది!?

05-11-2026 | 05:35am
  1. ఆ మొక్కలు సొంత డబ్బులతో కొంటేనే విలువ తెలుస్తుందా?
  2. ప్రజాధనం ఖర్చు చేసిన మొక్కలకు విలువ లేదా
  3. నాటి పెంచాల్సిన మొక్కలు స్మశాన వాటికలో వృధాగానేనా 
  4. అవసరమైన చర్యలు తీసుకుంటాం 
  5. శిల్ప, పంచాయతీ కార్యదర్శి, ఇబ్రహీంబాద్ గ్రామం, హన్వాడ మండలం 

హన్వాడ, నవంబర్ 4: అడిగితే అడిగారంటారు... ప్రశ్నిస్తే వీరే వచ్చారు ప్రశ్నించ డానికి అంటుంటారు... ఇది అన్యాయం కదా అంటే ఇక్కడే జరుగుతుందా ఇంకెక్కడ అన్యాయం జరగట్లేదా అంటూ నిర్లక్ష్యంగా కొందరు చెబుతుంటారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం(Misuse of public funds) చేసిన... లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మొక్కలను(Plants) పెంచి నాటేందుకు సంబంధిత గ్రామాలకు అందిస్తే ఆ మొక్కలు ఎక్కడ విసిరేశారో తెలియని దుస్థితి హన్వాడ మండలం(Hanwada Mandal) ఇబ్రహీంబాద్ గ్రామంలో(Ibrahimbad Village) చోటు చేసుకుంది.

ప్రతి మొక్కను వృక్షం చేయండి ఆ వృక్షం నీడనివ్వడంతో పాటు సమాజ ఎదుగుదలకు ఎంతో తోడ్పాటు అందిస్తుంది అంటూ ప్రభుత్వ పెద్దలు ని త్యం చెపుతుంటారు. కాగా వాటిని అమలు చేసే అధికారులు మాత్రం నిండా నిర్లక్ష్యంతో  మొక్కల లెక్కలు కాగితాలపై చూపిస్తూ తమ పని అయిపోయింది అన్నట్టు కొందరు అధికారులు వ్యవహరిస్తుంటారు.

ఇబ్రహీంబాద్ గ్రామంలో మొక్కలను వృధాగా పారవేయడంతో వాటిని చూసిన ప్రతి ఒక్కరు ఇలా వృధా చేయడమేంటంటూ ఎక్కడైనా నాటితే బాగుంటుందంటూ కోరుతున్నారు. అసలే ప్రభుత్వం డబ్బులు లేవు అంటూ చెబుతున్న ఉన్న డబ్బులు ఖర్చు చేస్తూ ఇలా వృధా చేయడమేంటంటే జనం అసహన వ్యక్తం చేస్తుండ్రు. 

- ప్రజాధనమే కదా పట్టించుకునేది ఎవరు?

 సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక మొక్కను కొనుగోలు చేసి ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు ఎక్కడైనా నాటిన ఆ మొక్క సంరక్షణకు సంబంధిత వ్యక్తి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉండడం మనం చూస్తుంటాం. కాగా ఇక్కడ ప్రజాధనం ఖర్చు చేసి తీసుకువచ్చిన మొక్కలకు మాత్రం ఆ ప్రాధాన్యత దక్కడం లేదని ఆ గ్రామవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప టికైనా ఆ మొక్కలు వృధా పోకుండా సం బంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని నాటేందుకు కృషి చేయాలని జనం చెబుతున్న మాట. ఆ మాటకు అధికారులు విలువ ఇస్తారా లేదా చూడాలి.

ప్రత్యేక చర్యలు తీసుకుంటం..

గ్రామంలో నర్సరీ ప్రైవేట్ స్థలంలో ఉండడంతో వారికి నిధులు ఇప్పటివరకు కొన్ని ఇవ్వవలసి ఉంది. వాటర్ ట్యాంక్ కూడా రిపేర్ లో ఉంది. ఉండని అని స్మశాన వాటిక దగ్గర మొక్కలను ఉంచడం జరిగింది. అవసరమైన చర్యలు తీసుకుంటాం.

శిల్ప, పంచాయతి కార్యదర్శి

ఇబ్రహీంబాద్ గ్రామం,

హన్వాడ మండలం

మరిన్ని వార్తలు