కాంగ్రెస్ సంచులు మోసే పార్టీ.. బీజేపీ చెప్పులు మోసే పార్టీ

05-11-2026 | 05:45am
  1. రేవంత్‌ను సీఎం చేయడమంటే.. వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రి చేయడమే! 
  2. కమీషన్ల కోసమే మియాపూర్ భూముల అమ్మకం 
  3. పేదలకు, అమరవీరులకు ఇస్తే వద్దంటున్నామా? 
  4. పారిశ్రామికవేత్తలు రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకులకు ఆశపడితే.. అనుభవిస్తరు! 
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నవంబర్ 4 (విజయక్రాంతి): ‘అడవులను నరికే వీరప్పన్‌ను(Veerappan) అటవీశాఖ మంత్రిని(Minister for Forest Department) చేస్తే ఎలా ఉంటదో, భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే.. ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి కూడా అలానే ఉంది’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను ఢిల్లీ పార్టీల(Delhi Party) నాయకత్వాల ముందు తాకట్టు పెడుతున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల(Congress and BJP parties) తీరు దొందూ దొందే అని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. రేవంత్‌రెడ్డికి(Revanth Reddy) మైక్ ఇస్తే లొల్లి పెట్టడం తప్ప ఏం తెల్వదని ఎద్దేవా చేశారు.

అయితే భూములు అమ్మాలి.. లేకపోతే కేసీఆర్‌ను(KCR) తిట్టడం తప్ప వేరే పనేలేదన్నారు. మియాపూర్ 550 ఎకరాల భూమి కోసం వైద్యనా థన్ అనే ప్రముఖ న్యాయవాదిని నియమించి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోరాటం చేసిందని గుర్తు చేశారు. కానీ కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల్లోనే అమ్మేస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించడం వెను క ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఆ భూములను అమ్మి హామీ ఇచ్చిన పథకాలు అమలు చేస్తే రేవంత్‌రెడ్డికి కమీషన్‌లు రావని, అందుకే వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కేవలం కమీషన్ల కోసం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

‘రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమంలో పని చేసినవాళ్లకు, అమరులైనవారి కుటుంబాలకు మియాపూర్ భూముల్లో జాగా ఇవ్వాలి.. హైదరాబాద్‌లోని పేదలందరికీ 100 ఎకరాల్లో మంచిగా టవర్స్ కడితే మేమేన్నా వద్దంటున్నమా?’ అని అన్నారు. ‘కేసీఆర్ ఉంటున్నరని, రాష్ట్ర రాజకీయాలకు అది కేంద్రబిందువైందన్న కోపం మీద అమరవీరులను తీసుకు పోయి ఎర్రవల్లిలో కాలనీ కట్టిస్తడట రేవంత్ రెడ్డి.. 80 కిలోమీటర్ల అవతల ఎందుకు.. మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టి యి.. మేమొద్దంటున్నమా..? అని పేర్కొన్నారు.

అమ్మేస్తా అంటున్న మియాపూర్ 550 ఎకరాల భూముల్లో 200 ఎకరాలు పేదలకు ఇండ్లు, 100 ఎకరాల్లో అమరవీరులకు, ఇంకో 100 ఎకరాలు ఉద్యమకారులకు, మిగతాది పిల్లలకు స్కూల్స్, కాలేజీలు కట్టిస్తే తామూ స్వాగతిస్తామన్నారు. సంవత్సరం లోపల కేసీఆర్ మళ్లీ తిరిగి రాబోతున్నారు.. ఎవరైనా పారిశ్రామికవేత్తలు రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడితే.. మీరు పొరపాటున హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ పేరుతో జరుగుతున్న (హిల్ట్ పీ) స్కాంలో భాగస్వాములైతే అనుభవించేది మీరు.. ఆ తర్వాత మమ్మల్ని అనొద్దు అని స్పష్టం చేశారు.

మా ప్రభుత్వం ప్రజల దయతో, దేవుడి ఆశీర్వాదంతో తప్పకుండా వస్తది.. వచ్చిన వెంటనే ఈ భూములన్నింటికి చెక్ పెడతమన్నారు. ఎవరు ఒక్క ఇంచు కొన్న వదిలి పెట్టబోమని హెచ్చరించారు. రేవంత్‌రెడికి తెలిసిందొకటే.. కొత్త పాలసీలు తీసుకురావాలి.. భూ దోపిడీ చేయడం మాత్రమే తెలుసన్నారు. హిల్ట్ పాలసీ పేరుతో కమీషన్ల దందాకు తెరలేపారని ఆరోపించారు.

పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన వేల కోట్ల విలువైన భూములను ప్రైవేటు ప్రయోజనాల కోసం విక్రయించడం దారుణమని విమర్శించారు. హైదరాబాద్‌లో పేదలకు ఇళ్లు కట్టేందుకు, వాటర్ ట్యాంక్ కడతామంటే, బస్ డిపోకు, బొందలగడ్డకూ జాగా లేకుండా పోయిందన్నారు. అలాంటిది 10 వేల ఎకరాల భూమిని రేవంత్‌రెడ్డి తన ముఠాకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు..

ఢిల్లీ పెద్దల ముందు తెలంగాణ నాయకులు వణుకుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని ప్రియాంక గాంధీ బౌన్సర్లు నెట్టివేసే పరిస్థితి రావడం కాంగ్రెస్‌లో తెలంగాణ సీఎంకు ఇస్తున్న గౌరవం ఏమిటో తెలియజేస్తోందన్నారు. అమిత్ షా ముందు బండి సంజయ్ బౌన్సర్‌లా వ్యవహరించడం, తనకంటే వయసులో చిన్నవాడైన అమిత్ షా కాళ్లకు రాంచందర్ రావు నమస్కరించాల్సిన పరిస్థితి రావడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజార్చడమేనని విమర్శించారు.

అమిత్ షా తెలంగాణకు వచ్చి చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయారని, రాష్ట్రానికి ఒక్క మెట్రో ప్రాజెక్టు, ఒక్క జాతీయ ప్రాజెక్టు, ఒక్క జాతీయ స్థాయి విద్యాసంస్థనైనా తీసుకురాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సంచులు మోసే పార్టీ అయితే, బీజేపీ చెప్పులు మోసే పార్టీగా వ్యవహరిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నాయకుల ముందు తాకట్టు పెట్టే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ప్రయోజనాలను కాపాడే శక్తి బీఆర్‌ఎస్‌కే ఉందని, కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వారానికి రెండుసార్లు ఢిల్లీకి వెళ్తున్నారని, రాష్ట్ర పరిపాలన కంటే ఢిల్లీ పర్యటనలు, రాజకీయ ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఒక ఈఎంఐ సీఎంలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించడం, రాష్ట్రానికి నిధులు తీసుకురావడం, అభివృద్ధి ప్రాజెక్టులను సాధించడం కంటే ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడమే ఆయనకు ముఖ్యమైందన్నారు.

భూ దందాలు, కమీషన్ల కోసమే ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రేవంత్ రెడ్డి పంచన చేరారని ఆరోపించారు. కేసీఆర్ను చూసి నాడు బీఆర్‌ఎస్‌ను గెలిపించారే తప్ప, రేవంత్ రెడ్డిని చూసి ఎవరూ ఓటు వేయలేదన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్‌కు చెందిన నాయకుడు అవుకు దామోదర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరగా, బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 

కాళేశ్వరంపై కక్ష.. పాలమూరుపై పగ.. 

తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరి స్తోందని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టి, పాలమూరు ఎత్తిపోతల పథకంపై పగబట్టి నీటిని ఎత్తిపోయడంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నీళ్లు అందుబాటులో ఉన్నా ప్రజలకు, రైతులకు అందించలేని దుస్థితి నెలకొందని, బొగ్గు అందుబాటులో ఉన్నా విద్యుత్ ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.

రైతులు, మహిళలు, పేదలు, ఉద్యో గులు, సామాన్య ప్రజలు సహా అన్ని వర్గాలను ఇబ్బందుల్లోకి నెట్టిన సర్వభ్రష్ట ప్రభు త్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్‌లో మళ్లీ తాగునీటి సమస్య తలెత్తిందని విమర్శించారు. హైదరాబాద్ మహానగరానికి నిరంతర తాగునీటి సరఫరా ఉండేలా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికతో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులను నిర్మించిందని గుర్తుచేశారు. భవిష్యత్తులో నగర జనాభా పెరిగినా తాగునీటి కొరత రాకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని తెలిపారు. అలాంటి ప్రాజెక్టులు, నీటి వనరులు అందుబాటులో ఉన్నా వినియోగించుకోలేకపో వ డం ప్రభుత్వ అసమర్థత అన్నారు.

మరిన్ని వార్తలు