మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి

29-11-2026 | 06:54pm

దేవరకద్ర(మహబూబ్ నగర్ జిల్లా) నవంబర్ 29 (విజయ క్రాంతి): దేవరకద్ర మండల(Devarakadra Mandal) కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి  ఆధ్వర్యంలో ఘనంగా "దీక్షా దివస్(Diksha Divas)" వచ్చే ఎన్నికల్లో మల్లి కేసీఆర్(KCR) ముఖ్యమంత్రి అయితారని ఎమ్మెల్యే అన్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దేవరకద్ర గులాబీ సైన్యం,ఉద్యమకారులు. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష,పోరాట స్ఫూర్తిని, ఉద్యమ ఙ్ఞాపకాలు గుర్తు చేసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. దేవరకద్ర నియోజకవర్గంలోనీ(Devarakadra Constituency) ఉద్యమ కారులను ఘనంగా సన్మానించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(MLA Alaa Venkateshwar Reddy). మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కామెంట్స్. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో దీక్ష చేపట్టారు.

కేసీఆర్ గారి దీక్ష ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం పదవులను త్యాగం చేసి,ప్రాణాలను లెక్క చేయకుండా రాజీ లేని పోరాటం చేశారు. పదవులను పణంగా పెట్టీ,రాజీనామాలను అస్త్రంగా మార్చుకుని కోట్లడారు. ఆంధ్రా నాయకుల కుట్రలు చేధించి ఉద్యమాన్ని గమ్యానికి చేర్చారు. తెలంగాణ ఏర్పాటు అవశ్యకతను ప్రజలకు వివరించి ,చైత్యన్య పరిచారు. కేసీఆర్ గారి ఉద్యమ చరిత్రను కొత్త తరం తెలుసుకోవాలి..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు ఉన్న పరిస్థితులు యువతకు తెలియదు. భవిష్యత్తు తరాలకు ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు,ఉద్యమ చరిత్ర,తెలంగాణ పునర్నిర్మాణం గురించి చెప్పాలి. ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా నిలబెట్టారు. తెలంగాణ ప్రజల విద్యుత్,తాగునీటి కష్టాలు తీర్చారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చి దేశంలో వరి ఎక్కువగా పండే రాష్ట్రంగా నిలిపారు.. రైతు బంధు వంటి ప్రపంచం మెచ్చిన పథకంతో రైతులను ఆదుకున్నారు.

కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగంగా ఉంది. కేసీఆర్ గారి సహకారంతో దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. 36 చెక్ డ్యామ్ లు నిర్మించి వేలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా కరివెన రిజర్వాయర్ నిర్మించుకున్నాం. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా  చేసినా వారెవ్వరు చేయలేని పనులు చేశాం. వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరుకి రివర్స్ మైగ్రేషన్ వచ్చేలా అభివృద్ధి చేశారు.. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక తెలంగాణలో అభివృద్ధి ఆగిపోయింది.

కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా మూడేళ్లు కాలయాపన చేసింది. ఉద్యమ స్పూర్తితో మళ్లీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. రసింహారెడ్డి ఉష్కిల వెంకట రాములు కార్యక్రమంలోచిన్న చిన్న నరసింహారెడ్డి నరసింహారెడ్డి పొరపాట్లతో అధికారం కోల్పోయాం. మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేద్దాం.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జెట్టి నరసింహారెడ్డి డాక్టర్ విస్కీల్లా పద్మ వెంకట్ రాములు. కొండల్ చల్మారెడ్డి కొండారెడ్డి పొన్నకల్ మై మధు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు