మీ సేవ తీరు మారేనా?

18-11-2026 | 05:40am
  1. ఒకే లాగిన్ ఒకే షాప్ పేరుకే.. రెండు చోట్ల లాగిన్ 
  2. నిబంధనలు ఎన్ని ఉన్నా... వారు చెప్పిందే ఫైనల్
  3. మీసేవ చార్జీలు పెంచిన...పెంచిన ధర పైనే వసూల్
  4. ఎవరు ఫిర్యాదు చేస్తారు? పట్టించుకునేది ఎవరు?
  5. ఇష్టానుసారంగా పలు మీ సేవల నిర్వహణ 
  6. తనిఖీలు చేపడతాం చర్యలు తీసుకుంటాం 
  7. రాజు నాయక్, తహసీల్దార్, మూసాపేట మండలం 

మూసాపేట, నవంబర్ 17 : మండల పరిధిలో ఓ మీసేవ(Meeseva) నిర్వాణతీరే వేరుగా ఉంది. ఒకే దగ్గర ఒక షాపు లో మీసేవ(income certificates) నిర్వహించాల్సి ఉండగా నిబంధనలను(Terms and conditions) పక్కనపె ట్టి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అందిన కాడికి దోచుకుంటుందని బాధితులు అసహన వ్యక్తం చేస్తున్నారు. ఒక మీ సేవ లాగిన్ ను రెండు మీసేవ కేంద్రాలుగా చలామణి చేస్తూ దర్జాగా నిర్వహిస్తూ నిబంధనలను పక్కదారి పట్టిస్తుండ్రు. కుల ఆదాయాలతో(Caste-based incomes) పాటు వివిధ పత్రాల జారీ(Issuance of documents) తో పాటు దరఖాస్తులు(Applications) చేయు ప్రక్రియలో వారి చేతివాటం మీసేవ ధరల కంటే అత్యధికంగా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చే స్తుండ్రు.

దూర ప్రాంతాల నుంచి మీసేవ కేంద్రాలకు(Meeseva centers) వచ్చే జనానికి ఈ మీసేవ తీరు వా రికి చేదు అనుభూతిని కలిగిస్తుంది. అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగదు? ఫిర్యాదు చేసిన చర్యలు ఉండవు? అనే దూరంలో కొంతమంది అటువైపే వెళ్లడం లేదంటూ చె బుతుండ్రు. నిరంతరం పర్యవేక్షణ చేయాల్సి న అధికారులే నిర్లక్ష్యంగా ఉంటే తాము చేసేదేముంటుంది అంటూ జనం చెబుతుండ్రు.

 ఇక్కడ వసూలు చూస్తే మతి పోవాల్సిందే..

 నిబంధనలు ఎన్ని ఉన్నా అధికారులు ఎంతమంది పర్యవేక్షణ చేసిన ప్రతి వినియోగదారుడు వెనుక అధికారి ఉండరు కదా అనే ధోరణిలో అదును చూసి అందిన కాడికి దోచుకునే ప్రయత్నంలో ఆ మీ సేవ నిర్వాహకులు తమ తమ ప్రయత్నాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారని బాధితులు విజయ క్రాంతి దినపత్రికకు తెలియజేశారు. లేబర్ కార్డు అప్లికేషన్ కు రూ 110 ఉంటే రూ 250 నుంచి రూ 300 రూపాయలు వసూలు చేస్తారంట. ఆ మీ సేవకు ప్రభుత్వ కార్యాలయానికి ఒక మధ్యవర్తిని పెట్టుకొని కుల, ఆదాయ ధ్రువీకరణ విషయంలో కూడా ఒక్కో సర్టిఫికెట్ కు రూ 250 వసూల్ చేస్తున్నారంటే వారి ధీమా ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవాలి. కొందరు మీ సేవ నిర్వాహకులు అయితే తమకు ప్రభుత్వం నుంచి వచ్చే పర్సెంటేజీ త్వరగా రాదని ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటుందని మేము ఎలా బతకాలంటూ మీసేవ కేంద్రానికి వచ్చిన వారిని ఎదురు ప్రశ్నిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లు అయితే మరింత ధర...

ఎస్సీ ఎస్టీల లాంటి సర్టిఫికెట్లకు అయితే కొందరి నుంచి ఒక్కదానికి రూ 1000 నుంచి రూ 1500 వసూలు పాల్పడుతున్నారంట.  వృద్ధులను ఫోన్ పే, గూగుల్ పే లాంటివి ఉంటే స్కాన్ చెయ్యాలి లేదంటే అంతే అనీ ఇబ్బందులకు గురి చేస్తే వారి ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితి ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు.  సర్టిఫికెట్ పేమెంట్ చెయ్యడానికి డబ్బులు చేతికి ఇస్తే తీసుకోవడం లేదని ఈ నిర్మాణ ఇలా ఉంటే ఎలా అంటూ వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజల సేవ కోసం ఏర్పాటుచేసిన మీసేవ కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక నిగా ఉంచి అధిక వసూలుకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొని జనానికి అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతుండ్రు.

తనిఖీలు చేపడతాం చర్యలు తీసుకుంటాం 

 ప్రజల నుంచి అత్యధికంగా మీసేవ కేంద్రాల్లో వసూలు చేసినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకు ఏ ధరలు నిర్ణయించడం జరిగిందో ఆదరణ మాత్రమే తీసుకోవాలి. లేదని తెలిస్తే చర్యలు తప్పవు తనిఖీలు చేపడతాం. 

      రాజు నాయక్, తహసీల్దార్, మూసాపేట మండలం,

మహబూబ్ నగర్ జిల్లా

మరిన్ని వార్తలు