పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ
లక్షేట్టిపేట, నవంబర్ 15 (విజయక్రాంతి): పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government)ముంటుందని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ(Kokkirala Surekha) అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట పట్టణంలోని శ్రీనివాస గార్డెన్స్ లో చేయూత ఫించను(Cheyutha Pension) మంజూరి పత్రాల పంపిణీకి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ప్రభుత్వం సమాజంలోని అసమానతలను నిర్మూలించే క్రమంలో పేదలకు పెన్షన్స్ ద్వారా చేయూతనందిస్తుందని తెలిపారు.
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు(Free electricity) అందిస్తూ మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని వివరించారు.ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన కూడా ప్రభుత్వం భరోసానిస్తుందన్నారు.ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతుందని వెల్లడించారు.ప్రజా సేవకే తమ జీవితాలు అంకితమని తెలిపారు. అనంతరం సుమారు 400 మంది లబ్దిదారులకు(beneficiaries) పెన్షన్ మంజూరి పత్రాలను స్థానిక నాయకులతో కలిసి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి,సింగిల్ విండో చైర్మన్ నాగభూషణం, వెంకట్రావ్ పేట్ సర్పంచ్ నలిమేల రాజు, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ రాజేష్,పట్టణ అధ్యక్షులు షాహిద్ అలీ,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆరీఫ్,అంకత్ పల్లి సర్పంచ్ లు లత వెంకటేష్,శాతరసి బానేష్, గొడిసేల రాజేశం, ముత్తే శైలజ సుధాకర్, కౌన్సిలర్లు చంద్రమౌళి,తోట సువర్ణ రమేష్,సుజాత, పద్మ, చిన్నయ్య,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.