అందులకి చూపునిచ్చిన తూడి రాజం

19-11-2026 | 05:17pm

బెల్లంపల్లి: పట్టణం రైల్వే స్టేషన్ ఏరియాకి(Railway Station Area) చెందిన తూడి రాజం (70)  గుండెపోటుతో మరణించారు. జనహిత సేవా సమితి(Janahitha Seva Samithi) కోశాధికారి కొడిపెల్లి గిరిప్రసాద్, కుటుంబ సభ్యులకు నేత్రదానం గురించి వివరించారు. పుట్టెడు దుఃఖంలో ఉండి నేత్రదానం చేసి  ఇద్దరు జీవితాల్లో వెలుగులు నింపారు. LV  ప్రసాద్ ఐ బ్యాంకు టెక్నీషియన్ ప్రదీప్ నేత్రదానం లో కార్నియా స్వీకరించారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ తూడి రాజం మృతి బాధాకరమని, పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సబ్యులు భార్య తూడి మల్లక్క, కుమారుడు కోడలు తూడి కుమారస్వామి-పుష్పలత దంపతులు, కుమార్తెలు స్రవంతి, మౌనిక అల్లుళ్ళు రామ ,ప్రవీణ్ మనుమలు, మనుమరాండ్లు  నేత్ర దానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.

వారి స్పూర్తితో బెల్లంపల్లి ప్రజలందరూ మరణానంతరం నేత్ర అవయవ దానానికి ముందుకు రావాలని కోరారు. జనహిత సేవా సమితి ద్వారా ఇది 27 వ నేత్రధాన కార్యక్రమనీ తెలిపారు. ఈ నేత్రధాన కార్యక్రమం కొరకు సహకారం అందించిన నేత్రదాత కుటుంబ సభ్యులు, వారి మిత్రులు కొండ రాజశేఖర్ జనహిత సేవా సమితి కోశాధికారి కోడిపెల్లి గిరిప్రసాద్, ప్రచార కార్యదర్శి నేత్రదాన కమిటీ బాధ్యులు డోలి సుకుమార్, ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ లకు  కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులకు ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకు వారు సర్టిఫికెట్ అందజేసారు.

మరిన్ని వార్తలు