తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా దీక్షా దివస్

29-11-2026 | 07:56pm

చెన్నూర్ (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS chief KCR) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష(Indefinite hunger strike) భారత రాజకీయ చరిత్రలోనే(History of Indian Politics) ఒక ప్రత్యేక ఘట్టమని, చరిత్ర లో చిరస్థాయిగా ఉంటుందని  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(Undivided Adilabad District) మాజీ జడ్పీ వైఎస్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి అన్నారు.  దీక్షా దివస్ సందర్భంగా చెన్నూర్ లో బిఆర్ఎస్  నాయకులు(BRS leaders) పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు.కొత్త బస్టాండ్  ఆస్నాద్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో నాయకుల తో కలిసి దీక్షలో పాల్గొన్నారు.

ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చేందుకు కేసీఆర్(KCR) తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమ బాట పట్టారని కొనియాడారు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలు, వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఉద్యమానికి రాజకీయ దిశానిర్దేశం చేశారని గుర్తుచేశారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ సమాజాన్ని ఉద్యమంలో ఒక్కతాటిపైకి తీసుకొచ్చిందని, ఆ దీక్షతో తెలంగాణ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళలు, మేధావులు జర్నలిస్టులు సైతం సహా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు.  ఉద్యమకారుల పోరాటాలు, త్యాగాలు వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.తెలంగాణ సాధన కోసం స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ప్రజల్లో చైతన్యం నింపి, ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు